శ్రీశైలం ఆలయంలో దేవికి స్వర్ణపుష్పార్చన


S .S. N . SASTRY

బంగారు పూలతో పూజ జరపడం గురించి తెలుగువారు తరచు వింటుంటారు. తల్లిదండ్రులకు షష్ఠిపూర్తి, 70, 80 సంవత్సరాల శాంతి జరిపినపుడు కొడుకులు, కోడళ్లు చిన్న బంగారు పూలతో వారిని పూజిస్తారు. ఆ తర్వాత ఆ పూలను తమకు ఆప్తులైనవారికి పంచిపెడతారు. అలాగే పెక్కు ఆలయాలలో దేవతామూర్తులకు బంగారు పూలతో పూజ జరుపుతారు.

 

స్వర్ణ పుష్పార్చన పేరిట దేవాలయాలలో అర్చన జరుగుతుంది. అష్టోత్తర నామావళి పేర్లను చదువుతూ పూజ చేయవలచిన దేవి పాదాల వద్ద స్వర్ణపుష్పాలను ఉంచడమే స్వర్ణ పుష్పార్చన. రాష్ట్రంలో పెక్కు ఆలయాలలో ఈ పూజ ఆనవాయితీగా జరుగుతున్నది.  శత అష్టోత్తర నామ మంత్రంతో పాటు బంగారు పువ్వుల పూజ కూడా జరుగుతుంది.

 

శ్రీశైలం ఆలయంలో భ్రమరాంబ అమ్మవారికి స్వర్ణపుష్పార్చన వైభవంగా జరుగుతుంది. భక్తులు హెచ్చు సంఖ్యలో ఈ పూజ జరుపుతారు. పూజా రుసుం రూ. 1,500. కర్తలకు 5 లడ్డూలు ప్రసాదంగా ఇస్తారు. ఉదయం 9 గంటలకు స్వర్ణ పుష్పార్చన పూజ ప్రారంభమవుతుంది. శ్రీశైలం ఆలయాన్ని సందర్శించే భక్తులకు ఆలయ పాలక మండలి  చక్కటి భోజన వసతులు సమకూర్చుతున్నది. దీనితో వారికి వివిధ పూజలు జరపడానికి సౌకర్యం కలుగుతున్నది.


SSN Sastry

SSN Sastry

Senior journalist having worked with leading and English dailies and magazines as Sub Editor, Senior Sub Editor and edition in-charge and Senior/Chief Reporter and Special Correspondent.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *